పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత
- February 25, 2026
లండన్ హామర్స్మిత్ ప్రాంతంలో 16 సంవత్సరాలుగా కొనసాగుతున్న ‘రంగ్రేజ్’ అనే ఇండియన్ రెస్టారెంట్ వచ్చే నెలలో మూతపడనుంది. రెస్టారెంట్ యజమాని హర్మాన్ సింగ్ కపూర్, పాకిస్తానీయులు మరియు తీవ్రవాదుల నుంచి వస్తున్న బెదిరింపులు, దాడులే ఈ నిర్ణయానికి కారణమని ఆరోపించారు.
సోషల్ మీడియాలో వేధింపులు ఎదుర్కొంటున్నట్లు, పోలీసుల నుంచి సరైన భద్రత లభించట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖలిస్తాన్ ఉద్యమంపై విమర్శిస్తూ వీడియోలు విడుదల చేసిన తర్వాత తన రెస్టారెంట్‌పై దాడి జరిగినట్లు గతంలోనే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన వ్యాపారాన్ని దెబ్బతీయవచ్చుగానీ, తన మనోధైర్యాన్ని మాత్రం ఎవరూ కూల్చలేరని కపూర్ స్పష్టం చేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతూ తిరిగి బలంగా నిలబడతానని ఆయన ప్రకటించారు.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్‌లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్‌కు ట్రంప్ షాక్..









