సంతానలేమికి మధుమేహం కారణమా?

- July 21, 2015 , by Maagulf
సంతానలేమికి మధుమేహం కారణమా?

మధుమేహం ఒకప్పుడు 40 - 50 ఏళ్లు దాటిన వారికే వస్తుంది కదా అని ఉండేది. కానీ ప్రస్తు పరిస్థితుల్లో దీనికి వయసుతో సంబంధం ఉండడం లేదు. ముఖ్యంగా గర్భిణుల్లో మధుమేహం అత్యంత ప్రమాదకరమైంది. గర్భం దాల్చాక వచ్చిన మధుమేహం ప్రసవం తర్వాత తగ్గిపోయే అవకాశం ఉంటుంది కానీ భవిష్యత్తులో తొందరగా, మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. గర్భం దాల్చక ముందు ఉన్న మధుమేహం జీవితాంత కొనసాగే అవకాశం ఉంటుంది. గర్భిణుల్లో మధుమేహం ఉండడం వల్ల పుట్టే బిడ్డలకు రావడమే కాకుండా, వారిలో ఎదుగుదల అవసరాన్ని మించి ఉండడం, ఊపిరితిత్తుల సమస్యలు రావడం, గుండె పెద్దగా ఉండడం వంటి కొన్ని రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇక కొందకు మహిళల్లో గర్భం దాల్చలేకపోవడం, వచ్చినా అది నిలవకపోవడంలాంటి సమస్యలు మనం తరచూ చూస్తూంటాం. దీనికి చక్కెర వ్యాధి ఒక కారణం కావచ్చు. ఈ సమస్య ఉన్న వాళ్లు ముఖ్యంగా ముందుగానే షుగర్‌ టెస్ట్‌ చేయించుకోవాలి. మధుమేహం ఉన్న మహిళల్లో కౌమారంలో ఉన్నవారు ఆహారపరమైన కొన్ని మార్పులు పాటిస్తూ వ్యాయామం చేయాలి. గర్భిణుల్లో ఈ సమస్య ఉన్నవారు డాక్టరు సలహా మేరకు ఇన్సులిన్‌ తప్పకుండా తీసుకోవాలి. మధ్య వయస్కుల్లో అయితే గుండె సమస్యలూ, మూత్రపిండ సమస్యలూ రాకుండా తగిన మందులను క్రమం తప్పకుండా వాడాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com