అబుదాబి క్రైసిస్ టీమ్ అత్యవసర సమావేశం..!!

- March 02, 2026 , by Maagulf
అబుదాబి క్రైసిస్ టీమ్ అత్యవసర సమావేశం..!!

యూఏఈః అబుదాబి క్రైసిస్ టీమ్ అత్యవసర ఆన్‌లైన్ సమావేశాన్ని నిర్వహించింది. ముఖ్యమైన రంగాల సంసిద్ధతలను సమీక్షించారు. అబుదాబి అత్యవసర నిర్వహణ వ్యవస్థ  ముఖ్యంగా ఎనర్జీ, ఆరోగ్యం, రవాణా, ఆహార భద్రత మరియు కమ్యూనికేషన్ రంగాలలో అవసరమైన సేవల నిరంతరాయ కొనసాగింపును నిర్ధారించడానికి కార్యాచరణ ప్రణాళికలపై చర్చించారు.  అబుదాబి పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మరియు బృంద అధిపతి మేజర్ జనరల్ అహ్మద్ సైఫ్ బిన్ జైతూన్ అల్ ముహైరి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా ముందస్తు హెచ్చరిక మరియు లాజిస్టికల్ సపోర్టు వ్యవస్థల ప్రభావాన్ని సమీక్షించారు. అబుదాబిలో పరిస్థితులు అదుపులోనే ఉందని మరియు ప్రాణ, ఆస్తులను కాపాడటానికి  అన్ని సంస్థలు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయని అబుదాబి పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com