అబుదాబిలో డ్రోన్ శకలాలు...తప్పిన ప్రమాదం

- March 02, 2026 , by Maagulf
అబుదాబిలో డ్రోన్ శకలాలు...తప్పిన ప్రమాదం

అబుదాబి: గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్న డ్రోన్ల అవశేషాలు అబుదాబిలోని ఐక్యాద్ (ICAD) ప్రాంతంలోని ఒక గిడ్డంగి మరియు ముసఫ్ఫా ప్రాంతంలోని వాణిజ్య వేర్హౌస్ పై  పడ్డాయని అధికారులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర స్పందనా బృందాలు సంఘటనా స్థలాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించాయి. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

అవశేషాలు పడ్డ ప్రాంతాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయడంతో పాటు సంబంధిత శాఖలు సమగ్ర సమీక్ష చేపట్టాయి.ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా గాయాల పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారం మాత్రమే విశ్వసించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అధికారిక చానెల్స్ ద్వారా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు సూచించారు. అపోహలు, నిర్ధారణ కాని వార్తలను పంచుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com