ఇరాన్‌ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!

- March 02, 2026 , by Maagulf
ఇరాన్‌ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!

వాషింగ్టన్:  ఇరాన్‌ పై సైనిక దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లాబీయింగ్ చేశారనే వాదనలను సౌదీ అరేబియా ఖండించింది.  టెహ్రాన్‌తో విశ్వసనీయ ఒప్పందాన్ని కుదుర్చుకునే లక్ష్యంతో జరిగిన దౌత్య ప్రయత్నాలకు సౌదీ మద్దతు ఇచ్చిందని వాషింగ్టన్‌లోని సౌదీ రాయబార కార్యాలయం ప్రతినిధి ఫహద్ నజర్ గుర్తు చేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్య పరిష్కారాలకు సౌదీ  మద్దతుగా నిలిచిందని పేర్కొన్నారు.  ఈ మేరకు నజర్ సోషల్ మీడియాలో ఒక ప్రకటనను పోస్ట్ చేశారు. 

అంతకుముందు వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయెల్ మరియు సౌదీ అరేబియాలకు చెందిన ప్రతినిధులు వారాల తరబడి లాబీయింగ్ చేసిన తర్వాత అమెరికా నిఘా వర్గాలు వద్దంటున్న అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించారని పేర్కొన్నది.

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com