ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం

- March 07, 2026 , by Maagulf
ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం

టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీని నియమించారని ఇటీవల కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఆ సమాచారం నిజం కాదని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వార్తలపై అధికారిక వర్గాలు స్పందిస్తూ, ప్రస్తుతం అలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి.

ఇదిలా ఉండగా, కొత్త సుప్రీం లీడర్ నియామక ప్రక్రియలో ఇరాన్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నట్లు అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా మొజ్తబా ఖమేనీ పేరు ప్రకటిస్తే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందనే ఆందోళన కారణంగా ప్రభుత్వం మౌనం పాటిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఇజ్రాయెల్ ఇప్పటికే కఠిన హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టే లీడర్లను లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గతంలో కూడా కీలక పదవులు చేపట్టిన కొందరు లీడర్లపై దాడులు జరగడం ఈ భయాలకు కారణమని అనలిస్టులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ నాయకత్వ మార్పుపై అంతర్జాతీయ స్థాయిలో ఉత్కంఠ కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com