యోగా చేస్తున్నారా? ప్రత్యేక ఆహారం ట్రై చెయ్యండి
- July 22, 2015
ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ఒక చక్కటి మార్గం. యోగా చేయడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు మంచి శరీరసౌష్టవం కూడా మన సొంతమవుతుంది. మన శరీరాన్ని మనం ప్రేమించుకునేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఖచ్చితంగా ఒక భాగం కావాలి. అయితే యోగా చేసేవారు ఆహారం విషయంలో కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కువ సమయం యోగా చేయడం వల్ల కండరాల నొప్పి బాధిస్తుంటుంది. దీన్ని అధిగమించలంటే రోజూ యోగా చేసి వచ్చిన తర్వాత ఒక అరటిపండును తప్పని సరిగా తీసుకోవాలి. అరటి పండులో పీచుపదార్ధం ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా శరీరానికి శక్తి అందుతుంది. దీనిలోని మెగ్నీషియం, సోడియంలు శరీరంలోని తేమ శాతాన్ని పెంచుతాయి. యోగా చేసేవారు ఖచ్చితంగా ఓట్స్‌ని తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఓట్స్‌లోని మెగ్నీషియం, పొటాషియంలు కండరాల నొప్పిని తగ్గిస్తాయి. శరీరానికి తగిన పీచునీ అందిస్తాయి. మరొక అల్పాహారం బాదం. ముందురోజు రాత్రి కొన్ని బాదం పప్పులను నీటిలో వేసి నానబెట్టి మరునాటి ఉదయం యోగా చేసేముందు వాటిని తినడం వల్ల శరీరానికి అలసట ఉండదు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు,విటమిన్లూ శరీరానికి తక్షణ శక్తినందిస్తాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









