భారతీయ బాలికను అపహరించిన కారుని కనుగొన్నబహరేన్ పోలీసులు
- August 03, 2016
మనామా: హోరా లో గత మంగళవారం రాత్రి ఓ భారతీయ బాలికను అపహరించేందుకు ఉపయోగించిన కారుని పోలీసులు గుర్తించారు కానీ, ఆ బాలిక ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. హోరా లో అత్యంత కీలక రహదారుల ప్రాంతంలో ఐదు ఏళ్ల సారాని ఆమె తల్లి కారులో ఒక నిమిషం కన్నా తక్కువ సమయం ఒంటరిగా వదిలివెళ్లడం జరిగింది. ఆయితే ఆ సమయంలో దుండుగులు కారుని , సారాని ఏకకాలంలో అపహరించారు.
సారా బాబాయి అనీష్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ అపహరణ గోల్డెన్ సాండ్ అపార్ట్ సమీపంలో సాయంత్రం 7.15 సమయంలో జరిగిందని తెలిపాడు. బాలిక తల్లి యధావిధిగా బేబీ సిట్టర్ లో కూర్చోబెట్టి హోరాలో వెలుపలికి రావడం తోనే సారాని కారుతో సహా కిడ్నాప్ చేసినట్లు తెలిపాడు. తాజా సమాచారం ప్రకారం, పాపని ఎత్తుకెళ్లడానికి ఉపయోగించిన కారు హోరా లోని కె.ఎఫ్.సి.దగ్గర వదిలివెళ్లినట్లు కనుగొనబడింది. మూలాల ప్రకారం, గ్లోబల్ పోజిషింగ్ సిస్టం కారులో ఉండటంతో బాలికని ఏ దిశలో తీసుకువెళుతున్నారో తెలుసుకొనే యత్నంలో పోలీసులు ఉండగా , కొన్ని నిమిషాలు తర్వాత అది పనిచేయడం మానేసింది. ఇందుకు కారణం కిడ్నాపర్ ఈ ఉపకరణంని ఊడపెరికి వేయడంతో తదుపరి ఆచూకీ వారికి లభించలేదు. తిరిగి వెళుతున్నప్పుడు మార్గంలో, ఆమె (తల్లి) కారు ఒక చల్లని స్టోర్ వద్ద నీరు కొనుగోలు చేసి , వెనుక సీటులో సారాని వదిలి వెళ్ళింది . ఈ ఒక నిమిషం కన్నా తక్కువ వ్యవధి ఆమెకు పట్టింది. ఆమె స్టోర్ నుంచి తిరిగి బయటకు వచ్చినప్పుడు, ఆమె తన కారు చాలా వేగంగా దూరంగా వెళ్లిపోవడం చూచి, కేకలు పెట్టుకొంటూ కారు వెనుక పరిగెత్తింది కానీ ఆమె ప్రయత్నం ఫలించలేదని అనీష్ విశదీకరించారు. హోరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు.దేశవ్యాప్తంగా చెలామణి కాబడేలా ఫేస్బుక్లో ఓకే పోస్ట్ చేసాడు అంతర్గత వ్యవహారాల శాఖ వర్గాలు ఒక అన్వేషణ ప్రారంభించింది. నా సోదరి యొక్క కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు 315820 ఒక ఆకుపచ్చ సుజుకి ఆల్టో, ఆమె కోసం కంపెనీ యాజమాన్యం ఇచ్చిన ఈ వాహనంలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జిపిఎస్) అమర్చారు. కారు చివరి స్థానం డిప్లొమాటిక్ ఏరియాలో ఉంది. కానీ ఆ తర్వాత కనిపించకుండా. కిడ్నాపర్ పరికరం పాడుచేశాడని , "అనీష్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







