స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- April 01, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, పీహెచ్సీ విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు గడువును పొడిగించారు. గతంలో ప్రకటించినట్టుగా దరఖాస్తు గడువు మార్చి 31 వరకు ఉండగా.. దానిని కాస్త ఈ నెల 20 వరకు పొడిగించారు. 2025-26 విద్యా సంవత్సరానికి కొత్తగా స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడంతోపాటు గతంలో దరఖాస్తు చేసుకొని రెన్యూవల్ స్కాలర్షిప్ల మంజూరు కోసం తెలంగాణ ఇపాస్ వెబ్సైట్లో కళాశాలలు, విద్యార్థుల నమోదుకు గడువును ఈ నెల 20 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ల మంజూరు పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి ఇపాస్ పోర్టల్ అనే ఆన్లైన్ సిస్టమ్ వెబ్సైట్ను అమలు చేస్తున్నారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద కొత్తగా దరఖాస్తు, పునరుద్ధరణ స్కాలర్షిప్ల మంజూరు కోసం డేటాను ప్రాసెస్ చేయడానికి, నమోదు చేసుకోవడానికి ఈ సిస్టమ్ కళాశాలలు, విద్యార్థుల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గత ఏడాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, పీహెచ్సీ విద్యార్థులు 10,89,253 మంది స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 9,70,243 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. కొత్తగా వివిధ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థుల్లో ఇప్పటి వరకు 3,70,375 మంది మాత్రమే స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!









