సినిమా రివ్యూ: ‘డెకాయిట్-ఒక ప్రేమ కథ’
- April 10, 2026
‘గూఢచారి’, ‘క్షణం’, ‘హిట్ 2’ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న హీరో అడవి శేష్. లాంగ్ గ్యాప్ తర్వాత ‘డెకాయిట్-ఒక ప్రేమకథ’ అంటూ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా షానియల్ డియో దర్శకత్వం వహించారు.కథ, స్ర్కీన్‌ప్లే డిపార్ట్మెంట్ అడవి శేష్‌దే. మరి, ప్రచార చిత్రాలతో అంచనాలు పెంచేసిన ఈ సినిమా రిలీజ్ తర్వాత అంచనాలను అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
తక్కువ కులానికి చెందిన హరి (అడవి శేష్), అగ్ర కులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్)ని గాఢంగా ప్రేమిస్తాడు. తెలిసిందే కదా.. కుల తారతమ్యాలున్న ప్రేమలు చాలా తక్కువ మాత్రమే గెలిచినట్లు చరిత్రలో చాలా కథలున్నాయ్. అలాగే ఈ ప్రేమకీ ఆ కులమే అడ్డుగా నిలుస్తుంది. కానీ, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ప్రియురాలే తన ప్రియుడ్ని హత్యాచారం, హత్య కేసులో ఇరికించి జైలుకి పంపించడానికి కారణమవుతుంది. దాంతో, ప్రియురాలిపై పగను పెంచేసుకుంటాడు ప్రియుడు. దాదాపు 15 ఏళ్ల తన జీవితం జైలులో మగ్గిపోయినందుకు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి ప్రియురాలిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. కానీ, పరిస్థితి మరోలా వుంటుంది. అప్పటికే సరస్వతి చాలా కష్టాలు, కన్నీళ్లలో మగ్గిపోతుంటుంది. అనుకోని పరిస్థితుల్లో ప్రియురాలికి తానే హెల్ప్ చేయాల్సి వస్తుంది.ఇద్దరూ కలిసి ఏకంగా దొంగతనాలు చేసేంతలా. అసలు సరస్వతి, హరిని జైలుకి ఎందుకు పంపించాల్సి వచ్చింది.? ఇద్దరూ కలిసి దొంగతనాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది.? వీరి ప్రేమకథ ఏ కంచికి చేరింది.? తెలియాలంటే ‘డెకాయిట్’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
అడవి శేష్ అంటే, క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీస్‌తో పాటూ యాక్షన్ హీరోగానూ మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో రెండు డిఫరెంట్ వేరియేషన్స్ వున్న లుక్స్‌లో కాస్త కొత్తగా కనిపించాడు. జైలులో వున్నప్పుడు మాస్ లుక్స్‌లోనూ, ప్రియురాలితో లవ్‌లో వున్నప్పుడు క్యూట్ అండ్ ఇన్నోసెంట్ లుక్స్‌లోనూ కనిపించి మెప్పించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో చెలరేగిపోయాడు ఎప్పటిలాగే. ఇక, మృణాల్‌కి ఈ సినిమాలో మరో మంచి పాత్ర దక్కింది. సరస్వతిగా, తన ప్రియుడు మెచ్చిన జూలియట్‌గా మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది. ఎమోషనల్ సీన్స్‌లో అలవోకగా నటించేసింది. సరస్వతి పాత్ర కన్నీళ్లు పెడితే ఆడియన్స్ కూడా కన్నీళ్లు పెట్టుకునేంతలా కనెక్ట్ అయ్యింది ఆ పాత్ర. ‘సీతారామం’ సినిమా తర్వాత ఆ స్థాయి పాత్రగా ఈ సినిమాలో సరస్వతి పాత్రను చెప్పుకోవచ్చు. అతుల్ కులకర్ణి.. జైలులో హీరోకి సపోర్టింగ్‌గా నిలబడి, జైలు నుంచి హీరోని తప్పించే పాత్రలో తన వంతు న్యాయం చేశారు. అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ వంటి పాత్రలు ఇంపార్టెంట్ అయినప్పటికీ అంతలా ఇంపాక్ట్ చూపించవు. సరిగ్గా వాడలేదనిపిస్తుంది. ఝాన్సీ, సునీల్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
కుల వివక్షతో వచ్చే ప్రేమకతల్ని గతంలో చాలానే చూసేశాం. అయితే, ఈ సినిమాలో ప్రేమ కథలో కొన్ని ట్విస్టులున్నాయ్. కానీ, అవి కూడా ఏమంత కొత్తగా అనిపించవ్. ఇంటర్వెల్లో ఓ చిన్న ట్విస్ట్లాంటిదొకటి రివీల్ చేస్తారు. క్లయిమాక్స్ కూడా ఇంకా బలంగా రాసుకుని వుండి వుంటే బాగుండేదనిపిస్తుంది. నిజానికి అడవి శేష్ స్క్రీన్‌ప్లే చాలా గ్రిప్పింగ్‌గా వుంటుంది. కానీ, ఎందుకో ఈ సినిమాలో స్క్రీన్‌ప్లే నే మైనస్ అనిపిస్తుంది. చాలా స్లోగా నడుస్తుంటుంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ జస్ట్ ఓకే. కానీ, అక్కడక్కడా యాక్షన్ ఘట్టాల్లో కాస్త ఫర్వాలేదనిపిస్తాడు. ఎడిటింగ్ ఇంకా ట్రిమ్ చేసే అవకాశం వుంది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు బాగా సాగతీతలా అనిపిస్తాయ్. సినిమాటోగ్రపీ బావుంది. నిర్మాణ విలువలు సినిమాకి టాప్ అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ ఓకే.
ప్లస్ పాయింట్స్:
అడవి శేష్ అండ్ మృణాల్ ఠాకూర్ పర్ఫామెన్స్, క్లైయిమాక్స్..బ్యాక్ గ్రౌండ్లో వచ్చే కన్నె పెట్టరో కన్ను కొట్టరో సాంగ్..
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్, రొటీన్ అనిపించిన చాలా సన్నివేశాలు..స్లో నెరేషన్..
చివరిగా:
‘డెకాయిట్-ఒక ప్రేమ కథ’..ఈ ప్రేమ కథను భరించడానికి కాస్త ఓపిక అవసరమే.!
తాజా వార్తలు
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్‌లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!









