అందమైన ఆకలి

- July 23, 2015 , by Maagulf
అందమైన ఆకలి

పసిడి వెన్నెలను వెదుకుతూ .. వచ్చాను కానీ 

మిరుమిట్లు గొలిపే నవ నాగరికపు వెలుతురులే 

కనిపించాయి 

 

పరుగులెత్తే సెలయేటి గలగలలు ఆలకించాలని 

వచ్చాను కానీ 

చెవులు దద్దరిల్లే పబ్బు స్టీరియో చప్పుడులే 

వినిపించాయి 

 

సున్నితమయిన చెండు మల్లెల పరిమళాల్ని 

శ్వాసించ  వచ్చాను  కానీ 

మనిషిని మత్తులోకి దింపుతున్న,నైటుక్లబ్బు 

మద్యధూమపానాది  వాసనలే వేసాయి 

 

నీ కను కొలకుల నుండి జాలు వారే మంచు కొండల్లోని 

చల్లదనానికోసం,ఇంధ్రలోకపు దేవకాంతవని  

నీ నాట్య బంగిమలను తిలకించాలని వలచి వచ్చాను కానీ  

 

నీ అపస్వరాల అడుగుల సవ్వడిలో.. నిగూడమయిన 

పేదరికపు ఆకలి ఆక్రందనలే తాళమై వినిపించే. 

 

(15-06-2013. ఎందరికో ఆనందం ఆట, ఆడే వారికి ఆకలి వేట) 

జయ రెడ్డి బోడ(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com