అల్పపీడనం కొనసాగుతోంది
- August 04, 2016
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ తీరాలను ఈ అల్పపీడనం ఆనుకుని ఉందని తెలిపింది. అలాగే అల్పపీడన ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఒడిశా, కోస్తాంధ్ర మీదగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని చెప్పింది.ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయని.... కోస్తా తీరం వెంబడి గంటకు 45 - 50 కి.మీ. వేగంలో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









