31వ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకలు ..

- August 05, 2016 , by Maagulf
31వ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకలు ..

 క్రీడా ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతి పెద్ద క్రీడాత్సవం 31వ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రెజిల్ నగరం రియో డి జనీరోలోని మరకానా స్టేడియంలో భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4:30 గంటలకు ఈ వేడులకను ప్రారంభించారు. బ్రెజిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలకు శ్రీకారం చుట్టారు. బ్రెజిల్ గర్వప్రదాత, ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఒలింపిక్ జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. మొత్తం మూడున్నర గంటల పాటు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఎవల్యూషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ బ్రెజిల్ పేరుతో వేర్వేరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.బ్రెజిల్ దేశపు అత్యుత్తమ గాయకులు అలపించే పలు గీతాలతో పాటు దెబోరా కోల్కర్ నేతృత్వంలో 6 వేల మందితో ప్రత్యేక నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సారి భారతదేశం నుంచి రికార్డు స్థాయిలో119 మంది అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 206 దేశాల నుంచి 10,500 మంది క్రీడాకారులు క్రీడా సమరంలో తలపడతారు. 306 స్వర్ణాలకు గాను 42 క్రీడాంశాలు, 37 వేదికల్లో జరుగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com