దాయిద్‌లోని 17 నిర్మాణ సంస్థలకు జరీమానా

- August 05, 2016 , by Maagulf
దాయిద్‌లోని 17 నిర్మాణ సంస్థలకు జరీమానా

దాయిద్‌ మునిసిపాలిటీలోని 17 నిర్మాణ సంస్థలకు జరీమానా విధించారు. నిబంధనల్ని అతిక్రమించిన కారణంగా గడచిన ఆరు నెలల్లో జరిగిన తనిఖీల అనంతరం ఈ జరీమానాల్ని విధించినట్లు అధికారులు తెలిపారు. దాయిద్‌ మునిసిపాలిటీ డైరెక్టర్‌ జనరల్‌ అలి అల్‌ తునాజి మాట్లాడుతూ, అక్రమ నిర్మాణాలు, అనుమతి లేకుండా ఫార్మ్స్‌లో నిర్మాణాలు చేపట్టడం, భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టడం, తాత్కాలిక ఫెన్సింగ్‌ లేకుండా నిర్మాణాలు కొనసాగిస్తుండడం, అక్రమంగా కన్‌స్ట్రక్షన్‌ వేస్ట్‌ని డంప్‌ చేయడం, అలాగే నిర్మాణానికి సంబంధించి ఎలాంటి సైన్‌ బోర్డ్స్‌ని వినియోగించకపోవడం వంటి నేరాలకుగాను ఈ జరీమానాల్ని విధించినట్లు తెలిపారు. ఇంకోవైపున దాయిద్‌ మునిసిపాలిటీ 335 లైసెన్సులను కన్‌స్ట్రక్షన్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ కోసం మంజూరు చేసిందని, 261 కన్‌స్ట్రక్షన్‌ డ్రాయింగ్స్‌ని ఆమోదించిందని, 154 ప్రాజెక్ట్‌ అకంప్లిష్‌మెంట్‌ సర్టిఫికెట్లను మంజూరు చేసిందని ఆయన వివరించారు. నిర్మాణ రంగానికి మునిసిపాలిటీ నుంచి పూర్తి సపోర్ట్‌ ఉంటుందని అయితే ఖచ్చితంగా నిర్మాణ సంస్థలు నిబందనల్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు అలి అల్‌ తునాజి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com