ప్రాన్స్‌ డిమ్‌సమ్‌

- July 24, 2015 , by Maagulf
ప్రాన్స్‌ డిమ్‌సమ్‌

ప్రాన్స్‌ డిమ్‌సమ్‌
కావలిసిన పదార్ధాలు
రొయ్యలు - ఎనిమిది
మైదా - అరకప్పు
ఉల్లికాడల తరుగు - రెండు స్పూన్లు
అల్లం తరుగు - ఒక స్పూను
సోయా సాస్‌ - అరస్పూను
మిరియాల పొడి - అరస్పూను
నువ్వుల నూనె - అరస్పూను
నువ్వులు - ఒక స్పూను
వెల్లుల్లిరెబ్బలు - ఐదు
టొమాటో - ఒకటి
నూనె - సరిపడా
ఉప్పు - సరిపడా
తయారీ విధానం
మైదాపిండిలో కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. రొయ్యలను శుభ్రం చేసి వాటిపై ఉప్పు,కారం,అల్లం తరుగూ, ఉల్లికాడల తరుగూ,సోయాసాస్‌, నువ్వుల నూనె, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకుని వాటి మధ్య ఒక రొయ్యను మసాలా మిశ్రమంతో పాటు ఉంచి, పూరీ అంచుల్ని మూసేసి డిమ్‌ సన్‌ ఆకృతిలో వచ్చేట్లు చేసి కొంచెం సేపు ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి, వెల్లుల్లి రెబ్బలూ,నువ్వులూ, మిరియాలపొడీ, ఎండుమిర్చీ, టొమాటో ముక్కలూ ఉప్పు వేసి వేయించి మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసి డిమ్‌సమ్‌ల(ఆవిరిలో ఉడికించిన రొయ్యలు)ను ఈ వెల్లుల్లి మిశ్రమంతో కలిపి వడ్డిస్తే సరి. డిఫరెంట్‌గా రొయ్య స్నాక్స్‌ రెడీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com