తీవ్రవాదం కేసుల్లో 526 మందికి దేశబహిష్కరణ
- August 07, 2016
తీవ్రవాదం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 526 మందిని దేశం నుంచి బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జస్టిస్ మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. జైల్లో ఉన్న 833 మందిలో 526 మందిని త్వరలో డిపోర్ట్ చేయనున్నట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. వీరిలో ఎక్కువమంది అల్ ఖైదీ మరియు ముస్లిం బ్రదర్‌హుడ్‌కి చెందినవారే ఎక్కువమంది ఉన్నారు. ఈ సంస్థల్ని టెర్రరిస్టు ఆర్గనైజేషన్లుగా ప్రభుత్వం గుర్తించింది. మిగిలినవారిని హౌతీ సానుభూతిపరులుగా గుర్తించారు. ఇరాన్, బషర్ అస్సాద్ నుంచి వచ్చి తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు వీరంతా. జనరల్ డైరెక్టరేట్ ఫర్ ఇన్వెస్టిగేషన్ వెల్లడించిన టెర్రర్ సస్పెక్ట్స్ సంఖ్య 5,176 కాగా, ఇందులో 4,343 మంది సౌదీలు, 47 మంది ఎమనీలు ఉన్నారు. అరెస్టయిన 12 మంది ఇరానియన్స్‌లో 9 మంది గత జూన్‌లో అరెస్టయ్యారు. ఆగస్ట్ 1, 2 తేదీల్లో 14 మంది తీవ్రవాదుల్ని సెక్యూరిటీ ఫోర్సెస్ అదుపులోకి తీసుకున్నాయి. ఇదిలా ఉండగా, 224 మందిని తీవ్రాదం కేసుల్లో నిర్దోషులుగా గుర్తించి విడుదల చేశారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









