గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానున్న పుష్కరాలు

- August 10, 2016 , by Maagulf
గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానున్న పుష్కరాలు

కృష్ణా పుష్కరాలు గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా, గోదావరి నదుల సంగమం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుష్కరాలను ప్రారంభిస్తారని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. మూడురోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసిన మంత్రి పలువురు ప్రముఖులకు పుష్కరాల ఆహ్వాన పత్రాలు అందజేశారు. రేపటి పుష్కరాల ప్రారంభోత్సవానికి రానున్న ముఖ్యమంత్రికి వెయ్యి మంది కళాకారులతో ఘనంగా స్వాగతం పలికేలా ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 170 ఘాట్లలో 43 ఘాట్ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com