రాఖీ పండుగని సైనికులతో జరుపుకోనున్న స్మృతిఇరానీ

- August 10, 2016 , by Maagulf
రాఖీ పండుగని సైనికులతో జరుపుకోనున్న స్మృతిఇరానీ

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి గుర్తుగా జరుపుకొనే రాఖీ పర్వదినాన్ని కేంద్ర మంత్రి స్మృతిఇరానీ మరింత ప్రత్యేకంగా జరుపుకోనున్నారు. సరిహద్దుల్లో ఉంటూ దేశం కోసం అహర్నిశలు శ్రమించే సైనికులతో ఈ వేడుకలు చేసుకోనున్నారు. రాఖీ పర్వదినాన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌ హిమనీనదానికి స్మృతి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆగస్టు 18న సియాచిన్‌ వెళ్లేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ నుంచి స్మృతి ఇరానీకి అనుమతి లభించింది.
స్మృతి పర్యటన కోసం ఆర్మీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టనుంది. స్మృతి ఇరానీ గాక.. మరో 8 మంది భాజపా మహిళా ఎంపీలు కూడా దేశ సరిహద్దుల్లో రాఖీ పండగ జరుపుకోనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. వీరు రాజస్థాన్‌, కశ్మీర్‌లలోని సరిహద్దులకు వెళ్లి జవాన్లకు రాఖీ కట్టనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com