మొదలైన 'నేను లోకల్'

- August 10, 2016 , by Maagulf

వరుస విజయాలతో జోరుమీదున్న కథానాయకుడు నాని. ఈ ఏడాది 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'జెంటిల్‌మన్‌' చిత్రాలతో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నాని కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి 'నేను లోకల్‌' అనే పేరును ఖరారు చేశారు. నాని సరసన కీర్తిసురేష్‌ కథానాయికగా నటిస్తోంది. బుధవారం నిర్మాత దిల్‌రాజు కార్యాలయంలో చిత్రీకరణ ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి, దర్శకుడుహరీశ్‌ శంకర్‌, నాని, కీర్తీ సురేశ్‌, నవీన్‌ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com