రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- July 19, 2026
రిఫా: బహ్రెయిన్‌లోని సదర్న్ మునిసిపాలిటీ నిర్వహించిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' కార్యక్రమం మూడో ఎడిషన్ విజయవంతంగా ముగిసింది. రిఫాలోని ఓయాసిస్ మాల్లో వారం రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సదర్న్ మునిసిపల్ కౌన్సిల్, ఓయాసిస్ మాల్ సహకారంతో నిర్వహించారు.
చిన్నారుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం, ప్రజా పరిశుభ్రత, వ్యర్థాల వర్గీకరణ, రీసైక్లింగ్ అలవాట్లను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యర్థాల వర్గీకరణ, రీసైక్లింగ్ పోటీలు, చిత్రలేఖనం, రంగులద్దే కార్యక్రమాలు, బొమ్మలాటలు, ఫేస్ పెయింటింగ్, ఒరిగామి కళా ప్రదర్శనలు, బెలూన్ల పంపిణీ వంటి వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించారు.
వీటితోపాటు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా అండ్ సెక్యూరిటీ కల్చర్ డైరెక్టరేట్, సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ సహకారంతో అవగాహన సదస్సులు, వర్క్‌షాప్‌లు కూడా ఏర్పాటు చేశారు. జూలై 13న బహ్రెయిన్ ప్రముఖ నటుడు బస్సామ్ అలీ నిర్వహించిన ఆటలు, బహుమతుల కార్యక్రమం చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమం వినోదంతో పాటు విద్యను అందించింది. అలాగే, పర్యావరణ పరిరక్షణ, ప్రజా పరిశుభ్రత, సుస్థిరతపై చిన్నారుల్లో అవగాహన పెంపొందించింది. అలాగే పర్యావరణ బాధ్యత కలిగిన సమాజ నిర్మాణానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!







