కిడ్నాప్ చేసిన 2 సంవత్సరాల తర్వాత వీడియో రిలీజ్ చేసిన తీవ్రవాదులు

- August 14, 2016 , by Maagulf
కిడ్నాప్ చేసిన 2 సంవత్సరాల తర్వాత వీడియో రిలీజ్ చేసిన తీవ్రవాదులు

ఉగ్రవాదుల బెడద ఏ ఒక్క దేశానికో పరిమితం కావడం లేదు. ప్రపంచంలోని చాలా దేశాలు ఉగ్రవాద బాధిత దేశాలే. వివిధ సంస్థల పేర్లతో బయటకు వస్తున్న ఉగ్రవాదులు మారణహోమం సృష్టిస్తున్నారు. ఇక ఆఫ్రికన్ కంట్రీ నైజీరియా విషయానికొస్తే బోకో హరామ్ తీవ్రవాదులు ఆ దేశాన్ని గడగడలాడిస్తున్నారు. ఏప్రిల్ 2014 లో ఓ స్కూలు నుంచి చిబోకి బాలికలను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఉగ్రవాదులు సరిగ్గా 852 రోజుల తర్వాత ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. బాలికలను తిరిగి క్షేమంగా అప్పగించాలంటే ప్రభుత్వం చెరలో ఉన్న తమ వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. దాదాపు 50 మంది వరకు అమ్మాయిలు హిజాబ్‌లు ధరించి వీడియోలో కనిపిస్తున్నారు. ఓ ఉగ్రవాది వారితో సైతం మాట్లాడించాడు. ఈ సందర్భంగా ఓ బాలిక మాట్లాడుతూ నైజీరియన్ ఎయిర్‌ఫోర్స్ దాడుల్లో తమతోపాటు కిడ్నాపైన వారిలో డజన్ల కొద్దీ అమ్మాయిలు కళ్లముందే ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పింది. అంతేకాదు వాయుదాడుల్లో మరణించిన అమ్మాయిలను కూడా వీడియోలో చూపించారు. ఈ బాలికలను విడిచిపెట్టాలంటే తక్షణమే పోలీసుల చెరలో ఉన్న తమ వారిని విడిచిపెట్టాలని అధ్యక్షుడు ముహమ్మదు బుహారి నేతృత్వంలోని ఫెడరల్ ప్రభుత్వాన్ని బోకోహరామ్ తీవ్రవాదులు డిమాండ్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com