గవర్నర్ నరసింహన్ నివాసంలో ఎట్ హోం కార్యక్రమం..
- August 15, 2016
స్వాత్రంత్యం దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహించే కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకాబోతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరవుతారని అధికారవర్గాలు తెలిపాయి. అయితే జెండా పండుగ ఇద్దరు సీఎంలను మరోసారి కలుపబోతోంది. గవర్నర్ నరసింహన్ నివాసంలో సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎట్ హోం కార్యక్రమం జరగబోతోంది. సీఎంలతో పాటు ఇతర అధికారులను గవర్నర్ తేనేటి విందుకు ఆహ్వానించారు. ఇద్దరు చంద్రులు కలుస్తున్నారంటేనే ఆసక్తి కలుగుతోంది. సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారు. తెలంగాణ నుంచి కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారు. అయితే ఇద్దరు సీఎంలు ఒకటి రెండు సార్లు మాత్రమే కలుసుకున్నారు. కలుసుకున్న పరిపాలన వ్యవహారాల గురించి చర్చించుకున్న సందర్భాలు లేవు. మరోసారి వీరిద్దరు కలయికకు రాజభవన్ వేదిక కాబోతోంది. రాజ్‌భవన్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమంలో చంద్రబాబు కేవలం 25 నిమిషాలు మాత్రమే ఉంటారు. చంద్రబాబు వచ్చేసరికి సీఎం కేసీఆర్ అక్కడికి చేరుకుంటారా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే ఈ కొద్దిపాటి సమయంలో ఇద్దరు చంద్రులు కరచాలనం చేసుకుంటారని తెలుస్తోంది. ఇద్దరు సీఎంల మధ్య చర్చల కోసం ఇటీవల గవర్నర్ గట్టిగానే ప్రయత్నాలు చేశారు. అమరావతి వెళ్లి రాయబారం నడిపాడు. ఇప్పుడు ఇద్దరు కలుస్తున్నారు కాబట్టి రెండు రాష్ట్రాల వ్యవహరాల గురించి చర్చించుకుంటారా లేక పలకరింపులతోనే సరిపెట్టుకుంటారా అనేది ఆసక్తిగా మారబోతోంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









