'ధ్రువ' చిత్రం ఫస్ట్‌లుక్‌ విడులైంది..

- August 15, 2016 , by Maagulf
'ధ్రువ' చిత్రం ఫస్ట్‌లుక్‌ విడులైంది..

రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న 'ధ్రువ' చిత్రం ఫస్ట్‌లుక్‌ విడులైంది. చెర్రీ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. తన లుక్‌ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నట్లు పోస్ట్‌ చేశారు. తమిళంలో విజయం సాధించిన 'తని ఒరువన్‌'కి రీమేక్‌గా దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిప్‌హాప్‌ తమిజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. దసరాకి 'ధ్రువ' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com