హజ్, ఉమ్రాహ్ యాత్రికులకు ఒమాన్-సౌదీ రోడ్డు మార్గంతో సౌలభ్యం
- July 28, 2015
త్వరలోనే నిర్మాణం పూర్తికానున్న బృహత్తర ఒమాన్-సౌదీ రోడ్డు మార్గం హజ్, ఉమ్రాహ్ యాత్రలకు వెళ్లే యాత్రీకులకు గొప్ప సౌలభ్యం కానున్నది. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య దూరం యూ. ఏ. ఈ. హుందా ఇంచుమించు 2000 కి. మీ. ఉంది. అవ్కాఫ్ మరియు మాతసంబంధ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు విడుదలచేసిన ఒక నివేదిక ప్రకారం - ఈ కొత్త రోడ్డు ఒమాన్ దేశంలో ఇంచుమించు 160 కి. మీ. లు ఉండగా, సౌదీ వైపు 519 కి. మీ. ఉంది. ఈ రోడ్డు, రెండు గల్ఫ్ దేశాల వాణిజ్య మరియు పర్యాటక రంగాలను బలోపేతం చేస్తుంది. అంటే కాకుండా, రెoడుదేశాల యాత్రీకులకు సౌలభ్యంగా ఉంటుంది. ఇది, ప్రపంచంలోనే అతిపెద్ద ఇసుక ఎడారులలో ఒకటైన ఎంప్టీ క్వార్టర్ ఎడారినుండి పోతుంది అని, ఈ అరబ్ సంవత్సరాంతనికల్లా పూర్తి కావస్తుందని తెలియవచ్చింది.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







