ఒమాన్‌లో కార్మికుల కస్టాలు... రెండు రోజులు నడిచి రాయబార కార్యాలయానికి

- August 17, 2016 , by Maagulf
ఒమాన్‌లో కార్మికుల కస్టాలు... రెండు రోజులు నడిచి రాయబార కార్యాలయానికి

 ఒమాన్‌ :   బతుకు తెరువు కోసం భారతదేశం నుంచి  ఒమాన్‌ కు వచ్చిన  కొందరు భవన నిర్మాణ కార్మికులు నానా బాధలు పడుతున్నారు, వీరంతా  పని చేయడానికి ఇక్కడకు వచ్చి మోసపోయిన 14 మంది తెలంగాణ కార్మికులు ఎట్టకేలకు స్వరాష్ట్రానికి  పయనమయ్యారు. ఆదిలాబాద్‌,కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన వీరు ఒమాన్‌లోని జబల్‌అల్‌ అఖ్దర్‌ అనే ప్రాంతం సమీపంలో కొండలు,నదుల మధ్య రెండు రోజులు నడిచి తర్వాత ట్రక్కులో 150 కిలోమీటర్ల దూరంలోని రాజధాని మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నారు. తమను ఆదుకోవాలంటూ వారు అధికారులకు  చేసిన విజ్ఞప్తికి దౌత్యఅధికారులు చలించిపోయి  వారిని స్వదేశానికి పంపేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. 

భవననిర్మాణ కార్మికులుగా పనిచేసేందుకు వీరంతా ఆరు నెలల క్రితం గల్ఫ్‌కు వచ్చారు. ముంబైలోని వర్లిలో ఉండే కరీంనగర్‌ జిల్లాకు చెందిన  ఒక ఏజెంటుకు డబ్బు చెల్లించిన తాము కొండలపై ఆటవిక జీవనశైలీలో   నివాసం ఉంటున్నామని బాధితులు తమ గోడు వెళ్ళబోసుకొన్నారు. ఒక పాఠశాల భవన నిర్మాణంలో కొంతకాలం పనిచేశాక ఒక నెల జీతం చెల్లించి, మిగిలిన కాలానికి జీతం చెల్లించకపోవడంతో పని లేక చేతులో డబ్బులు లేక, అనేక ఇబ్బందులతో స్వరాషా్ట్రనికి తిరిగి వెళ్తున్నట్లుగా వారు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com