ఇరాన్ నుండి బందీలను విడిపించుకునేందుకు రూ.2,600 కోట్లు కట్టిన అమెరికా
- August 18, 2016
ఇరాన్లో బందీలుగా పట్టుబడ్డ తమ దేశీయులను విడిపించుకునేందుకు దాదాపు రూ.2,600 కోట్లను అమెరికా చెల్లించిందంటూ ప్రముఖ వార్తాసంస్థ 'వాల్‌స్ట్రీట్ జర్నల్' సంచలనాత్మక కథనాన్ని వెలువరించింది. ఈ ఏడాది జనవరి 17న జెనీవా విమానాశ్రయంలో సదరు చెల్లింపు జరిగినట్లు పేర్కొంది. బందీలుగా ఉన్న ముగ్గురు అమెరికన్లు టెహ్రాన్ నుంచి విమానంలో బయలుదేరాకే అమెరికా అధికారులు ఇరాన్‌కు డబ్బు ముట్టజెప్పారని వివరించింది. దాన్ని బలపర్చేలా అధికారుల వివరణనూ ఉటంకించింది.
అయితే, ఇరాన్‌తో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఓ వివాదాన్ని పరిష్కరించుకునే యత్నాల్లో భాగంగానే తొలివిడతగా ఆ మొత్తం చెల్లించామని... బందీలను విడిపించుకునేందుకు కాదని ఒమామా ప్రభుత్వం తాజాగా నొక్కిచెప్పింది. ప్రభుత్వ వాదనను రిపబ్లికన్ నేషనల్ కమిటీ(ఆర్ఎన్సీ) ఛైర్మన్ రీన్స్ ప్రీబస్ తోసిపుచ్చారు. బందీలను విడిపించుకునేందుకే సదరు సొమ్ము ముట్టజెప్పినట్లు ప్రభుత్వం అంగీకరించాలని సూచించారు.
దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకున్న నిర్ణయాన్ని హిల్లరీ క్లింటన్ గుడ్డిగా సమర్థించారని వ్యాఖ్యానించారు. తాజా కథనం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ పార్టీకి ఇబ్బందులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









