కొత్త తరహావ్యాయామాలు ఎంచుకోవాలి...

- August 18, 2016 , by Maagulf
కొత్త తరహావ్యాయామాలు ఎంచుకోవాలి...

మ నలో చాలామంది వ్యాయామం చేయాలన్న ఆలోచన రాగానే వెనకాముందూ ఆలోచించకుండా వెంటనే మొదలు పెట్టేస్తారు. కానీ అది మంచి పద్ధతి కాదు. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందు వీటి గురించి కాస్త తెలుసుకోండి.. కొందరికి సిజేరియన్‌ వంటి శస్త్రచికిత్సలు జరిగి ఉంటాయి. అలాగే ఇంకేదయినా అనారోగ్య కారణాల వల్ల శస్త్రచికిత్సలు జరిగినా జిమ్‌లో శిక్షణ ఇచ్చే నిపుణులకు ఆ వివరాలు చెప్పి వ్యాయామాన్ని మొదలుపెట్టాలి. ఇంత బరువు తగ్గాలని లక్ష్యం నిర్దేశించుకునే ముందు.. అది వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అంతేకాని ఒక నెలలో ఐదు కేజీలు తగ్గిపోవాలి వంటి భారీ లక్ష్యాలను నిర్దేశించుకోవద్దు. దానివల్ల నిరాశే తప్ప సానుకూల ఫలితాలు సాధించలేం. మనం చేసే వ్యాయామం ప్రభావం మన కండరాలపై పనిచేయాలి.అలా జరగడం వల్ల కెలొరీలు కరిగి కొవ్వు తగ్గుతుంది. కీళ్లని ప్రభావితం చేసే వ్యాయామాలు, చిన్న చిన్న బరువులు ఎత్తడం ఇందుకు ఉత్తమమైన మార్గాలు.్ద ప్రతి నెలా మనం చేసే వ్యాయామాలని మారుస్తూ ఉండాలి. నిపుణుల సాయంతో కొత్త తరహావి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఏళ్ల తరబడి ఒకేలాంటివి చేయడం కొత్తగా వచ్చే ఫలితాలు కూడా ఉండవు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com