ప్రపంచంలోనే అతి పెద్ద హోటల్‌: అబ్రాజ్‌ కుడియా

- August 18, 2016 , by Maagulf
ప్రపంచంలోనే అతి పెద్ద హోటల్‌: అబ్రాజ్‌ కుడియా

10 వేల గదులతో అతి పెద్ద హోటల్‌ని ఊహించుకోగలమా? అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది సౌదీ అరేబియా. వచ్చే ఏడాది ఈ హోటల్‌ని ప్రారంభించనుంది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవనంలో ప్రస్తుతం అనేక హంగుల్ని అమర్చే పని జరుగుతోంది. ఈ పెద్ద హోటల్‌ పేరు అబ్రాజ్‌ కుడియా. ఇందులో 10 వేల గదులు అత్యంత విలాసవంతంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పటికైతే 7,351 గదులతో మలేసియాలోని జెంటింగ్‌ హైలాండ్స్‌ అనే హోటల్‌ సేవలు అందిస్తోంది. ఆ రికార్డుల్ని అబ్రాజ్‌ కుడియా బ్రేక్‌ చేయనుంది. 45 అంతస్తులతో ఈ హోటల్‌ని నిర్మించారు. ఇందులో 12 టవర్స్‌ ఉంటాయి. 10 అంతస్తుల పోడియం కూడా ఉంటుంది. హెలికాప్టర్‌ ద్వారా వచ్చే యాత్రీకులకు వీలుగా టవర్లపై హెలిప్యాడ్స్‌ని ఏర్పాటు చేశారు. ఇందులో సౌదీ రాయల్‌ ఫ్యామిలీ కోసం 5 అంతస్తుల్ని ప్రత్యేకంగా కేటాయించారు. 4 హెలిప్యాడ్లు, 70 రెస్టారెంట్లు ఇందులో ప్రత్యేక ఆకర్షణ. 3.5 బిలియన్ల ఖర్చుతో ఈ హోటల్‌ని నిర్మించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com