యూఏఈలో క్యాష్ పేమెంట్ ఆప్షన్‌ని ప్రారంభించిన ఉబెర్
- August 18, 2016
యూఏఈలో ఉబెర్ క్యాబ్ వినియోగదారులకోసం క్యాష్ పేమెంట్ ఆప్షన్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 2013లో ఉబెర్ క్యాబ్ సర్వీసుల్ని యూఏఈలో ప్రారంభించినప్పుడు కేవలం క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు మాత్రమే అనుమతిచ్చామనీ, వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ నేపథ్యంలో క్యాష్ పేమెంట్‌కి మార్గం సుగమం చేశామని యూఏఈ ఉబెర్ జనరల్ మేనేజర్ క్రిస్ ఫ్రీ తెలిపారు. ఉబెర్ కార్ యాప్‌తో వినియోగదారులకు ఉబెర్ కార్ డ్రైవ్ మరింత సంతోషాన్ని మిగుల్చుతుందని ఆయన చెప్పారు. దుబాయ్ మరియు అబుదాబీలో క్యాష్ ఆప్షన్ ఇంకా టెస్టింగ్‌లో ఉంది. ఇండియాలో గత ఏడాదే క్యాష్ పేమెంట్ ఆప్షన్‌ని అందుబాటులోకి తెచ్చింది ఉబెర్. క్యాష్ పేమెంట్ ఆప్షన్ అందుబాటులో ఉన్న ఏడో దేశంగా యూఏఈ నిలిచినట్లు ఉబెర్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









