మహిళ ప్రాణాల మీదకు తెచ్చిన వేడుకలు

- August 18, 2016 , by Maagulf
మహిళ ప్రాణాల మీదకు తెచ్చిన వేడుకలు

వేడుకల్లో సరదా కోసం గాల్లోకి కాల్పులు జరపడంతో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలైన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. వెడ్డింగ్‌ సెలబ్రేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వివరించాయి. ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి రిఫర్‌ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామనీ, కఠిన శిక్షలు కూడా విధిస్తున్నామనీ అయినా సరే వేడుకల్లో గాల్లోకి కాల్పులు జరుగుతున్న ఘటనలు మాత్రం తగ్గడంలేదని పోలీసు వర్గాలు చెప్పాయి. పెళ్ళి వేడుకలు విషాదాంతమవుతున్నాసరే, గాల్లోకి కాల్పులు జరపడాన్ని మాత్రం కొందరు మానలేకపోవడం బాధాకరమని పోలీసులు చెప్పారు. సౌదీ నిబంధనల ప్రకారం వేడుకల్లో గాల్లోకి కాల్పులు జరపడం నేరం. ఈ నేరానికిగాను వరుడ్ని అక్కడికక్కడే అరెస్ట్‌ చేయడానికి వీలుంది. ఎక్కువగా వరుడు గన్‌తో గాల్లోకి కాల్పులు జరపడం అనేది జరుగుతుంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com