షార్జా వాటర్ పార్కులో మూడేళ్ళ బాలుడు నీట మునక

- August 19, 2016 , by Maagulf
షార్జా వాటర్ పార్కులో మూడేళ్ళ బాలుడు నీట మునక

షార్జ:  ఆహ్లాదం కోసం పార్కుకి  వచ్చి తమ తమ వ్యవహారాల్లో నిమగ్నమైన ఆ తల్లితండ్రులు  తమ మూడేళ్ళ బాబుని మరచిపోవడంతో ఆ  చిన్నారి బుడి బుడి అడుగులతో  నీట మడుగు వైపు వెళ్లి అందులో పడిపోయాడు. ఈ విషాదకర ఘటన షార్జాలో అల్ ముంతాజాహ్  పార్కులోని వాటర్ పార్కు వద్ద బుధవారం జరిగింది. అక్కడ మూడేళ్ళ బాలుడు నీట  మునిగిపోవడంతో రక్షించిన స్థానికులు తరువాత అల్ ఖ్అసిమి  హాస్పిటల్ లో చేర్పించారు. అక్కడ ప్రస్తుతం చావు బతుకుల  మద్య  ఆ పసి ప్రాణం పోరాడుతోంది. ఎం.ఎస్.ఎస్. గా గుర్తించబడిన ఆ  బాలుడు అల్ ఖ్అసిమి  హాస్పిటల్ అత్యవసర విభాగంలో బుధవారం రాత్రి  7.50 సమయంలో చేర్పించారు  ఆ పిల్లవాడు కాలు జారీ  నీటిలో పడిపోయాడు. ఆ బాలుని  కుటుంబం అది గమనించే సరికి  నీటిలో మునకలువేస్తున్న స్థితిలో వారు గమనించారు. తేరుకున్న తల్లితండ్రులు  యుఎఇ లోని అల్ ఖ్అసిమి ఆసుపత్రిలో మూడేళ్ళ బాలుడిని చేర్పించారు. అయితే , వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి  క్లిష్టంగా ఉందని పేర్కొన్నారు. ఇది తల్లితండ్రుల నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనబడుతుందని షార్జా పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అల్ బుహారః  పోలీసులు ఈ  సంఘటన గూర్చి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com