అత్యధిక రోడ్డు ప్రమాదాలకు బహ్రేయినీ డ్రైవెర్లే ప్రధాన కారణం

- August 19, 2016 , by Maagulf
అత్యధిక రోడ్డు ప్రమాదాలకు  బహ్రేయినీ డ్రైవెర్లే  ప్రధాన కారణం

మనామా: తాజా గణాంకాల ప్రకారం గత సంవత్సరం జరిగిన పలు రోడ్డు ప్రమాదాలలో అత్యధిక శాతం  దేశంలో ట్రాఫిక్ ప్రమాదాలకు ప్రధాన కారణం  బహ్రేయినీ డ్రైవర్లు అని  తెలిపింది. ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ గురువారం ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, దేశంలో  రోడ్డు ప్రమాదాల్లో  66.46 శాతం  బహ్రేయినీ డ్రైవర్ల కారణంగా ప్రమాదాలు జరిగేయని తెలిపారు.  దేశాలవారీగా రోడ్డు ప్రమాదాలు చేసినవారి జాబితా ఈ విధంగా ఉంది.

భారత జాతీయులు 253 ప్రమాదాలు (9.97 శాతం), పాకిస్థానీయులు 135 (5.32 శాతం), బంగ్లా దేశీయులు 168 (6.58 శాతం), సౌదీ జాతీయులు 87 (3.43 శాతం) అని  వెల్లడించింది.
ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ట్రాఫిక్ సంస్కృతి డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఒసామా బహార్ అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క ప్రచురణ ఉదాహరిస్తూ, బహరేన్ ప్రజలు సాధారణంగా ఏమైనా రోడ్డు  ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో  ప్రవాసీయులు రోడ్డు ప్రమాదాలు చేసినట్లుగా ఆరోపిస్తుంటారు  అంతేకాక నిర్వాసితులు చెడ్డ  డ్రైవర్లుగా  పేర్కొంటారు అయితే, తాజా గణాంకాలు ప్రమాదాలు జరిగేటప్పుడు బహరేన్ వాసులే సాధారణంగా వాహనాల్ని నడుపుతుండటం గమనార్హం  గత సంవత్సరం వారి కారణంగా  1,686 (66.46 శాతం) ప్రమాదాలు సంభవించేయని  తెలియజేసాడు, "ఇతర దేశాలకు చెందిన  మాత్రమే 210 మంది మాత్రమే పాల్గొన్న రోడ్డు ప్రమాదాలు సంభవించినపుడు వాహనం నడుపుతున్నారని ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com