ఏ.పి లో 26, 27 తేదీల్లో జాబ్‌మేళా
- August 19, 2016
నిరుద్యోగ యువతకు చేయూతను అందించాలన్న ఉద్దేశంతో ఈనెల 26, 27 తేదీల్లో గుంటూరు రూరల్ చౌడవరంలోని ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాల ప్రాంగణంలో జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. రావెల ట్రస్టు, వికాస ఆధ్వర్యంలో నవ్యాంధ్రప్రదేశ్ యువతకు ఈ మహాదావకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. జాబ్‌మేళాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం విడుదల చేసినట్లు మంత్రి రావెల పేర్కొన్నారు. దేశ విదేశాలకు చెందిన 60 కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొని సుమారు 5 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించనున్నాయని మంత్రి పేర్కొన్నారు.
10వ తరగతి, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులు పూర్తిచేసిన వారికి వారి అర్హతల మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈనెల 23వ తేదీలోగా ఆన్లైన్లో www.ravelatrust.org అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









