దుబాయ్ నుంచి జెండాను దిగుమతి చేసుకోవాలని హెచ్ఎండీఏ నిర్ణయం..

- August 20, 2016 , by Maagulf
దుబాయ్ నుంచి జెండాను దిగుమతి చేసుకోవాలని హెచ్ఎండీఏ నిర్ణయం..

 హెచ్ఎండీఏకు భారీ జెండా భారంగా మారింది. చిరుగులు పడుతుండటంతో ఇప్పటికే 8 జెండాలు హెచ్ఎండీఏ మార్చింది. జెండా మార్చినప్పుడల్లా హెచ్ఎండీఏకు రూ.1.50 లక్షలు ఖర్చు అవుతోంది. అయితే దుబాయ్ నుంచి జెండాను దిగుమతి చేసుకోవాలని హెచ్ఎండీఏ నిర్ణయం తీసుకుంది. యురోపియన్ పాలిస్టర్‌తో షార్జా అనే కంపెనీ జెండా తయారు చేయనుంది. దీనికి 4800 డాలర్లు ఖర్చు అవనుంది. మూడు నెలల వారెంటీతో జాతీయపతాకం తయారు చేయనుంది. ఇప్పటికే రాంచీ అధికారులు దుబాయి నుంచి త్రివర్ణ పతాకాన్ని దిగుమతి చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com