హిమాచల్‌ప్రదేశ్‌లో 20 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది..

- August 27, 2016 , by Maagulf
హిమాచల్‌ప్రదేశ్‌లో 20 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది..

హిమాచల్‌ప్రదేశ్‌లో శనివారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. 20 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. ఉదయం 6.44 గంటల ప్రాంతంలో 4.6 తీవ్రవతో భూమి కంపించగా..7.05 గంటల సమయంలో మరోసారి ప్రకంపనలు సంభవించినట్లు భూవిజ్ఞాన అధికారులు తెలిపారు. కుల్లు ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ప్రకంపనలతో స్థానికులు ఆందోళనలకు గురయ్యారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com