యాభైవేల వరహాల యాగం

- July 30, 2015 , by Maagulf
యాభైవేల వరహాల యాగం

ఒక ఊరిలో ఒక సాధువు వటవృక్షం కింద పురాణ పఠనాలు చేసేవాడు. ప్రతీరోజూ రాత్రి ఊరి జనం అంతా ఆయన ప్రసంగాలు వినడానికి వచ్చి వెళ్లేవారు. ఒకరోజు ప్రసంగం అయిన తరువాత శిష్యుడు నేలను శుభ్రం చేస్తూ ఉండగా అక్కడ ఒక బంగారు ఆభరణం తళతళా మెరుస్తూ కనిపించింది. దాన్ని తీసుకెళ్లి గురువుగారికి చూపించగా..ఎవరో భక్తురాలు పోగొట్టుకుని ఉంటుంది. రేపు ఆమెకు అందజేద్దాం దాచి ఉంచమని గురువు శిష్యునికి చెప్పాడు. అ్పుడు ఆ శిష్యుడు అంతమందిలో ఇది ఎవరిదని గుర్తించగలం స్వామీ! అని గురువుని అడిగాడు. అందుకు గురువు నవ్వి ఊరుకున్నాడు. మరునాడు ప్రసంగం పూర్తవగానే ఆయన భక్తులతో భక్తులారా! మీలో ఎవరో ఒక విలువైన ఆభరణాన్ని పోగొట్టుకున్నారు. అది చూస్తే ఆ వ్యక్తి ఎవరైనా కానీ చాలా బాధల్లో ఉండి గ్రహదోషంతో బాధపడుతున్నవారివలే ఉన్నట్లు నా దివ్యదృష్టికి కనిపించింది. కనుకు ఆ ఆభరణం తీసుకునేవాళ్లు ఏభై వేల వరహాలు చెల్లించి గ్రహయాగం చేయించుకోండి. అది కూడా నా చేతుల మీదుగా నిర్వహించగలను. అంటూ తన దగ్గరున్న ఆభరణాన్ని బయటికి తీసి చూపించాడు. భక్తులందరూ దాన్ని చూశారు కానీ ఎవ్వరూ మాది అని ముందుకు రాలేదు. ఇంతలో ఒక మహిళ ముందుకు వచ్చి స్వామీ! ఆ ఆభరణం నాదే. ఆ యాగం ఏంటో సెలవియ్యండి చేయిస్తాను అంది. అప్పుడు స్వామీజీ అందరు వెళ్లిపోయేవరకూ ఆమెను వేచి ఉండమని చెప్పి ఆమె ఆభరణం ఆమెకి తిరిగి ఇచ్చి కంగారు పడకమ్మా నీకే గ్రహదోషం లేదు అని చెప్పి పంపించాడు. గురువుగారి తెలివితేటలకు శిష్యులు చాలా సంతోషించారు. పదివేల విలువ గల ఆభరణాన్ని దక్కించుకోవడానికి యాభైవేల వరహాలు ఖర్చుపెట్టడానికి ఎవ్వరూ ముందుకు రారు. అది నిజంగా తమదైనవారు తప్ప. అందుకే అలా చెప్పాను అని గురువు శిష్యులకి సెలవిచ్చాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com