నీకే సొంతం
- July 31, 2015
అవును శీతల పవనం లాంటి నువ్వు నిజం,
మల్లె పువ్వు లాంటి నీ నవ్వు నిజం
కాంతులీను నీ మేను పరిమళం కూడా నిజమే..
సింహాసనంపై మహా రాణి వైన,
వెండి తెరలపై తారవైనా,
పల్లె తోటలోని పడచు వైనా
ఇంటి ముందు ముద్దు ముద్దు గొబ్బెమ్మవైనా
రాబోయే నీ చెలికాడి కి నువ్వొక ముద్దు గుమ్మవే
యుగ యుగాలుగా నిన్ను చూసే ఆతని చూపుల
నయనానంద హేల, భావుకత్వంలో తడిపే నీ కంటి చూపుల స్పర్శ
అతనికొక, జీవితానికి సరిపడే జోల పాటల ఊయల
పూల సౌరభాల వసంతాల వెన్నెల వేళల్లోనో ..
నీలోని పరువాలు విచ్చుకొనే పడచు ప్రాయం కాలంలోనో
ఆతను నీ చుట్టూనే తిరుగాడుతుంటాడు ఓ భ్రమరం లా
"ప్రేమికుల రోజు" మురిపాలెన్నో మురిపిస్తూ ...
అప్పుడే! నీలోని సహజమైనా సహనశీలి మేల్కొని
వెలుపలకు రావాలి, పరిసరాలను పరిశీలించి పరికిస్తూ ...
అతను పాడే బావోద్వేగ పల్లవుల ఆకర్షణ ల కో
కాలం పండని ప్రాయం నిండని నీ మదిని,
లోలోన కోరలు తీస్తూ నీ కాయాన్ని కాటు వేసే,
విష నాగులే మత్త కోకిల యై, మభ్య పెట్టేందుకు రావొచ్చు ..
అందుకే,నువ్వొక పెద్ద మనసువై .. పరిపూర్ణం అయిన వివేకమై
లేవాలి, పదిలంగా తిరిగి నీవుండే కలుగులోకో లేక,
నీ వాళ్ళు మమతల పుల్లలు కూడేసి నీ చుట్టూ నీ కోసమే
అల్లిన నీ "గూటి" లోకో వెళుతూ..
నీకొచ్చే నీకు నచ్చే, వసంతుడి రాక కోసం వేచి ,,
కలల రాణివై విహరిస్తుండాలి..నీ ప్రేమికుని కోసం
అప్పుడే .. అప్పుడే
పొత్తిళ్ళలో పాపాయిలా, కన్నుల్లో కనుపాపగా,తమ ఆహారాన్ని
నీ భవిష్య పల్లకి కి ఫణంగా పెట్టి ,నీపై ఆశల పొదలల్లుకొని ..
బ్రతుకంతా నీ క్షేమానికై గుండె గేయలల్లె నీ తల్లి దండ్రులకు
కడుపు కోత నీయని ... నిజమైన నీ ఆనందం "నీకే సొంతం"
(14-02-2014.. నిజమైన నీ తల్లి దండ్రుల ప్రేమ కోసం, నిజాయితి పరుడైన నీ ప్రియుడి రాక కోసం ఈ ఆనందం నీకే సొంతం)
జయ రెడ్డి బోడ (అబుధాబి)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







