తెలుగు వారికి కలిగిన విముక్తి
- July 31, 2015
లిబియా ముఖ్యపట్టణం సిర్తేలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన నలుగురు తెలుగువారు క్షేమంగా ఉన్నారు. బందీలు నలుగురిని ఉగ్రవాదులు ఈరోజు సాయంత్రం విడుదల చేశారు. విడుదలైన లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ లలో ఒకరు రాయ్ చూర్ కు చెందినవారుకాగా, మరొకరు బెంగళూరుకు చెందిన వ్యక్తి. వీరిద్దరూ విడుదలైనట్టు విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. కాగా, తాము కూడా కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైయ్యామని, క్షేమంగా ఉన్నామని ఏపీ, హైదరాబాద్ లకు చెందిన గోపీకృష్ణ, బలరామ్ తమ కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టారు. అయితే వీరిద్దరూ విడుదలైనట్టు విదేశాంగ శాఖ ఇంకా ధ్రువీకరించలేదు. వీరిని కిడ్నాప్ చేసింది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కాదని, స్థానిక ముఠా అని వార్తలు వస్తున్నాయి. కిడ్నాపైన వారిలో వీరిలో ముగ్గురు సిర్తేలోని యూనివర్సిటీలో లెక్చరర్లుగా పనిచేస్తుండగా, మరో వ్యక్తి వేరే వృత్తిలో ఉన్నాడు. కిడ్నాప్ ఉదంతంపై స్పందించిన విదేశీ వ్యవహారాల శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. నలుగురు భారతీయులు కిడ్నాప్ కు గురైనట్లు జులై 29నే తెలిసిందని, అప్పటినుంచి వారి విడుదల కోసం అవిశ్రాంతంగా కృషి చేశామని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. బందీల విడుదలపై విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







