అధిక బరువు సమస్యలు దూరం చేసుకోండి

- April 14, 2015 , by Maagulf
అధిక బరువు సమస్యలు దూరం చేసుకోండి

మనిషి తన ఆరోగ్యం గురించి ఎన్నో రకాల జాగ్రత్తలు పడుతున్నా కొన్ని సమయాల్లో మనకు తెలియకుండానే ఆహార విషయంలో తేడాలు రావడం శరీరంలో మార్పులు రావడం జరుగుతుంటాయి. యవ్వనంలో ఈ సమస్యలు తలెత్తక పోయినా 35 సంవత్సరాల తర్వాత శరీరంలో మార్పులు రావడం సహజం. పొట్ట, నడుము భాగాలు పెరిగిపోవడం అధిక బరువు సమస్యలు తెలెత్తుతాయి. వీటి నుంచి ఉపశమనం పొందాంలంటే ఈ పద్దతులు పాటించండి..! మీరు మరీ బరువుగా ఉన్నారా ? పది మందిలో తిరగాలంటే కాస్త బిడియంగా ఉన్నరా అయితే ఏం ఫరువాలేదు మీరు బరువు తగ్గే తరుణోపాయాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా తమలపాకులు మంచి ఔషదం గా పనిచేస్తుంది. అవునండీ ! తమలపాకుతో బరువు తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. జీర్ణక్రియను మెరుగుపరిచే తమలపాకును తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చును. తమలపాకు బరువు నష్టం ప్రక్రియను వేగవంతం చేసి శరీరంలోని కొవ్వును తగ్గించేందుకు సహాయపడతుంది. తమలపాకుతో వంటకాలు గ్యాస్ట్రిక్ ఆమ్లాల వలన వచ్చే చెడు ప్రభావాల నుండి ఉదర పూతను రక్షిస్తుంది. అలాగే తమలపాకులు, మిరియాలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ఉత్తమం. తమలపాకు చాలా శక్తివంతమైన కడుపు ఉబ్బరం లక్షణాలను పూర్తిగా తొలగిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. లేత మరియు ఆకుపచ్చగా ఉన్న తమలపాకులో 5 మిరియాల గింజలను వేసి, తమలపాకును మడిచి నమలాలి. మిరియాలు ప్రారంభంలో కొంచెం కారంగా ఉండవచ్చు. అలాగే ఆకును నమిలి తినాలి. ఇలా చేయడం ద్వారా ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో 8 వారాల పాటు తీసుకోవాలి. మిరియాలలో ఫ్యాతో న్యూట్రియంట్స్, పెప్పేరిన్ ఉండటం వల్ల కొవ్వు విచ్ఛిన్నంలో సహాయపడుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com