అఫ్ఘానిస్థాన్ లో 97మంది తాలిబన్ మిలిటెంట్లు హతం
- August 31, 2016
అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ల ఆధీనంలో ఉన్న పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ లో ఉగ్రవాదులు అంతం అయ్యారు. పలు ప్రావిన్స్ లో 97 మంది తాలిబన్ ఉగ్రవాదులు అంతం అయ్యారని ఆఫ్ఘాన్ రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
ఆఫ్ఘాన్ రక్షణ శాఖ అధికారులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మందుపాతరలు నిర్వీర్యం చేశారు.
ఈ ఆపరేషన్ లో 97 మంది ఉగ్రవాదులతో పాటు 12 మంది సైనికులు మరణించారని వెల్లడించారు. పక్టియా ప్రావిన్స్ లోని జని ఖేల్ జిల్లాలో భద్రతా దళాల దాడిలో 57 మంది ఉగ్రవాదులు హతం అయ్యారు. బఘ్లాన్ ప్రావిన్స్ లో 15 మంది, హెల్మండ్, కాబుల్, కుండుజ్ ప్రావిన్స్ లో 25 మంది ఉగ్రవాదులు అంతం అయ్యారు. తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి ఇంకా దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ విషయంపై తాలిబన్లు ఇంకా స్పందించలేదు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









