అశ్లీల వెబ్ సైట్లపై భారత్ కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది
- August 03, 2015
గత రెండు రోజుల్లో 4860 పోర్న్ సైట్లను బ్యాన్ చేసిన ప్రభుత్వం తాజాగా మరో 857 సైట్లను బ్లాక్ చేయాలని ఇంటర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమేనంటూ ఓ వైపు శృంగార ప్రియులు సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు కేంద్రం దూకుడు ప్రదర్శిస్తోంది. సుప్రీం కోర్టు సూచనల మేరకు పోర్న్ సైట్లను బ్లాక్ చేస్తున్నట్లు ప్రభుత్వం సమర్ధించుకుంటోంది. దీనిపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జూలై 8న సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. పిటిషనర్‌కు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించింది. దీంతో అశ్లీల సైట్ల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రం సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చింది. ఈ మేరకు పోర్న్ సైట్లపై కొరడా ఝళిపిస్తోంది. అలాంటి సైట్లను బ్లాక్ చేయాలంటూ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఇంటర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. అయితే ఇవి తాత్కాలిక చర్యలేనని, సుప్రీం కోర్టు తుది తీర్పుతో తదుపరి చర్యలుంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







