దసరాకి రానున్న 'ఈడు గోల్డ్‌ ఎహే'

- September 04, 2016 , by Maagulf
దసరాకి రానున్న 'ఈడు గోల్డ్‌ ఎహే'

వీరు పొట్ల దర్శకత్వంలో సునీల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'ఈడు గోల్డ్‌ ఎహే'. కామెడీ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో సునీల్‌ బంగార్రాజు పాత్రను పోషిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు సాగర్‌ మహతి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సుష్మా రాజ్‌, రిచా పనైలు సునీల్‌ సరసన కథానాయికలుగా నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గత నెలలో విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని చిత్ర బృందం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com