భారత్ దేశంపై కుబేరుల పట్టు

- September 04, 2016 , by Maagulf
భారత్ దేశంపై కుబేరుల పట్టు

అత్యధిక ఆర్థిక అసమానతలు ఉన్న రెండో దేశంగా భారత్‌ నిలిచింది. మరోవైపు భారత్‌లో అత్యధిక సంపద కేవలం మిలియనీర్ల వద్ద మూలుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. మిలియన్‌ డాలర్లు అంతకంటే ఎక్కువ సంపద ఉన్న వారి వద్దే దేశంలోని 54శాతం సొమ్ము మూలుగుతోందని న్యూవరల్డ్‌ వెల్త్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో పేర్కొన్నారు. ఇక అత్యధిక వ్యకిగత సంపదలు ఉన్న దేశాల జాబితాలో భారత్‌ టాప్‌టెన్‌లో స్థానం దక్కించుకుంది.
ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో రష్యా మొదటి స్థానంలో నిలిచింది. ఆదేశంలో 62శాతం సంపద కుబేరుల వద్దే పోగుపడింది. దేశంలోని సంపన్నులు, వారు అదుపుచేసే సంపద నిష్పత్తిని బట్టి దీనిని అంచనా వేస్తున్నారు.

ప్రపంచంలో అత్యంత సమానమైన దేశంగా జపాన్‌ నిలిచింది. ఇక్కడ కేవలం 22శాతం సంపదను మాత్రమే సంపన్నులు అదుపు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో కూడా కేవలం 28శాతం సంపదను మాత్రమే సంపన్నులు శాసిస్తున్నారు. ఇటువంటి సమాజంలో బలమైన మధ్యతరగతి వర్గాలకు అవకాశం ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఇక పెద్దన్న అమెరికాలో 32శాతం సంపదను సంపన్నులు గుప్పిట్లో పెట్టుకున్నారు. యూకేలో కొంచెం ఎక్కువగా 35శాతం సంపదను గుప్పిట్లో పెట్టుకున్నారు.
ఇక బిలియనీర్లను లెక్కలోకి తీసుకుంటే రష్యాలోనే అత్యధికంగా 26శాతం సంపద వారి వద్ద ఉంది. జపాన్‌లో అత్యల్పంగా 3శాతం మాత్రమే వారిచెప్పుచేతుల్లో ఉంది. ఆస్తులు, నగదు, వాటాలు, వ్యాపారాలు, వంటివి లెక్కలోకి తీసుకొని ఈ సర్వేను నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com