కాబూల్‌లో సోమవారం జంట పేలుళ్లు..

- September 06, 2016 , by Maagulf
కాబూల్‌లో సోమవారం జంట పేలుళ్లు..

ఆఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లో జంటపేలుళ్లు జరిగిన కొద్ది గంటలకే మరోసారి కాల్పులు కలకలం రేగింది. నగరంలోని పమ్లారేనా ఛారిటీ సంస్థపై దాడి జరిగింది. సాయుధులైన ఇద్దరు దుండగులు ఛారిటీ భవనంలోకి చొరబడి కాల్పులకు తెగబడినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఓ దుండగుడిని పోలీసులు హతమార్చగా.. మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడికి గల కారణాలు తెలియరాలేదు.కాబూల్‌లో సోమవారం జంట పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. నగరంలోని రద్దీగా ఉన్న ప్రాంతంలో తాలీబన్‌ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 24 మంది మృతిచెందగా.. మరో 91 మందికి పైగా పౌరులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com