ఒమన్ ట్రాఫిక్ జరీమానాల్లో 2000 శాతం పెరుగుదల
- September 06, 2016
మస్కట్: ఒమన్ ట్రాఫిక్ చట్టానికి చేసిన సవరణలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు ఇంకా కఠినమైన చర్యలుంటాయి. 10 రోజుల నుంచి 2 సంవత్సరాల వరకు కొన్ని నిబంధనల ఉల్లంఘనలకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. జరీమానాలు కూడా 200 రియల్స్ నుంచి 3000 రియాల్స్ వరకు ఉంటాయి. రహదారిపై భద్రత కోసం కఠిన చర్యలు తప్పడంలేదని, ప్రమాదాల్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది జూన్ నెలాఖరు వరకు మొత్తం 336 మంది, 2100 రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినట్లు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫిగర్స్ వెల్లడిస్తున్నాయి. 2015 జులై డెడ్లీయెస్ట్ మంత్‌గా రికార్డులకెక్కింది. మొత్తం 71 మంది ఈ నెలలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. కొత్త నిబంధనల ప్రకారం మద్యం సేవించి వాహనాన్ని నడిపితే 10 నుంచి 30 రోజులపాటు జైలు శిక్ష తప్పదు. అలాగే 50 రియాల్స్ నుంచి 300 రియాల్స్ వరకు ఫైన్ విధిస్తారు. రోడ్డుపై ప్రమాదకర స్థితిలో ఫీట్స్ చేస్తే 3 నెలల జైలు శిక్ష, 500 రియాల్స్ ఫైన్ విధిస్తారు. రెక్లెస్గా వాహనాన్ని నడిపినా 3,000 రియాల్స్ వరకూ జరీమానా చెల్లించాల్సి రావొచ్చు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









