హమ్రియాలో అగ్ని ప్రమాదం

- September 06, 2016 , by Maagulf
హమ్రియాలో అగ్ని ప్రమాదం

హమ్రియాలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎవరూ చనిపోవడంగానీ, గాయపడ్డంగానీ జరగలేదు. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్సెస్‌ అండ్‌ అంబులెన్సెస్‌ (పిఎసిడిఎ) వర్గాల ప్రకారం, వుడ్‌ మరియు ఎలక్ట్రానిక్‌ ఐటమ్స్‌ ఈ ఇంట్లో స్టోర్‌ చేసినట్లు తెలియవస్తోంది. పిఎసిడిఏ, సమాచారం అందగానే హుటాహుటిని సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని వేరే ప్రాంతాలకు విస్తరించకుండా తగిన చర్యలు తీసుకుంది. అనంతరం మంటల్ని అదుపు చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com