60 ఏళ్ళు పైబడ్డ వలసదారులకు ఎలక్ట్రానిక్‌ వర్క్‌ పర్మిట్స్‌

- September 06, 2016 , by Maagulf
60 ఏళ్ళు పైబడ్డ వలసదారులకు ఎలక్ట్రానిక్‌ వర్క్‌ పర్మిట్స్‌

సెప్టెంబర్‌ 19 నుంచి 60 ఏళ్ళు పైబడ్డ సీనియర్‌ వలసదారులు ఎలక్ట్రానిక్‌ పద్ధతుల్లో వర్క్‌ పర్మిట్స్‌ కోసం అప్లయ్‌ చేసుకోవచ్చు. లేబర్‌ మార్కెట్‌ రెగ్యులేటరీ అథారిటీ వెబ్‌ సైట్‌లో ఈ మేరకు స్పష్టతనిచ్చారు. ఎలక్ట్రానిక్‌ పద్ధతుల్లో ఇఎంఎస్‌ (ఎక్స్‌పాట్రియేట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) ద్వారా వారి అప్లికేషన్లు తీసుకోబడ్తాయని, అధికారికవ ర్గాలు వెల్లడించాయి. ఇన్వెస్టర్స్‌ వర్క్‌ పర్మిట్స్‌ కూడా ఈ విధానంలోనే మంజూరు చేయబడ్తాయి. సెప్టెంబర్‌ 19 లోపు మాత్రం మాన్యువల్‌గానే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పూర్తి వివరాల కోసం సంబంధిత వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు. అప్లికేషన్‌ అప్రూవ్‌ చేయబడినా లేదంటే తిరస్కరించబడినా, సంబంధిత వ్యక్తికి ఇ-మెయిల్‌ మరియు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందుతుంది. 'న్యూ వర్క్‌ పర్మిట్‌ లేదా రెన్యువల్‌ ఫర్‌ ఓవర్‌ 60' ఒరిజినల్‌ అప్లికేషన్‌తోపాటు, అప్లికెంట్‌కి సంబంధించిన ఐడీ కార్డ్‌, ఎంప్లాయీ పాస్‌పోర్ట్‌, ఎంప్లాయీ ఐడీ కార్డ్‌, ఎంప్లాయ్‌మెంట్‌ కాంట్రాక్ట్‌ వంటివి అవసరమవుతాయి. స్పెషలైజ్డ్‌ ఆక్యుపేషన్‌ కోసం క్వాలిఫికేషన్‌ సర్టిఫికెట్లు కూడా అవసరం. డాక్టర్లు, టీచర్లు, ఇంజనీర్లు, ఇన్స్యూరెన్స్‌ మరియు బ్యాంకింగ్‌ సెక్టార్‌కి చెందిన వారైతే సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌ అప్రూవల్‌ పొందాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com