పది 'ఆసియాన్‌' దేశాల అధినేతలతో విడివిడిగా సమావేశం కానున్న మోదీ

- September 06, 2016 , by Maagulf
పది 'ఆసియాన్‌' దేశాల అధినేతలతో విడివిడిగా సమావేశం కానున్న మోదీ

భారత ప్రధాని మోదీ బుధవారం లావోస్‌ రాజధాని వియంటియాన్‌లో పది 'ఆసియాన్‌' దేశాల అధినేతలతో విడివిడిగా సమావేశం కానున్నారు. ఆసియాన్‌-భారత్‌ 14వ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానంగా సముద్రతల భద్రత, ఉగ్రవాదం, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సహకారంపై చర్చించనున్నారు. మంగళవారం మొదలైన ఆసియాన్‌ దేశాల సదస్సులో భాగంగా బుధవారం ఆసియాన్‌ భారత్‌ శిఖరాగ్ర సమావేశం, గురువారం తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం జరుగుతాయి. ఈ రెండింటిలోనూ భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆసియాన్‌-భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాన్ని 2015లో ప్రకటించినప్పటి నుంచి ఆ దేశాలతో భారత్‌ వాణిజ్య బంధం మరింత బలపడింది.మన వాణిజ్యంలో 12 శాతం ఈ పది దేశాలతోనే ఉంది. గురువారం తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో పది ఆసియాన్‌ దేశాలతోపాటు భారత్‌, చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌, అమెరికా, రష్యా పాల్గొంటాయి. 2005లో తూర్పు ఆసియా శిఖరాగ్ర వేదిక ఏర్పాటు చేసినప్పటి నుంచీ భారత్‌ అందులో సభ్యురాలిగా ఉంది. దక్షిణ చైనా సముద్రం మీద చైనా దుందుడుకు చర్యలపై ఆసియాన్‌ దేశాలు అభ్యంతరం చెబుతున్న తరుణంలో తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో ఆయా పక్షాలు అనుసరించే వైఖరి ఆసక్తికరంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com