టీవీ సిరీస్‌గా బ్రూస్‌లీ రాసిన కథ

- September 07, 2016 , by Maagulf
టీవీ సిరీస్‌గా బ్రూస్‌లీ రాసిన కథ

బ్రూస్‌లీ పేరు తెలియని వారుండరు. 1940లో జన్మించిన బ్రూస్‌లీ 'ది బిగ్‌ బాస్‌'.. 'ఎంటర్‌ ది డ్రాగన్‌' వంటి సినిమాలు.. కొన్ని టీవీషోలు చేసి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. 32ఏళ్ల వయస్సులోనే అనారోగ్యానికి గురై మరణించాడు. అయితే ఆయన చనిపోయిన 46ఏళ్ల తర్వాత ఇప్పుడు బ్రూస్‌లీ రాసిన కథను బుల్లితెర పైకి తీసుకొచ్చేందుకు ఆయన కూతురు ప్రయత్నిస్తోంది.బ్రూస్‌లీ నటించడంతో పాటు.. ఒక సినిమాకు స్క్రిప్టు రాశాడు. 'ది సైలెంట్‌ ఫ్లూట్‌' పేరుతో సినిమా చేద్దామనుకున్నాడు. కానీ.. ఆయన చనిపోయిన ఐదేళ్ల తర్వాత దాన్ని 'సర్కిల్‌ ఆఫ్‌ ఐరన్‌' పేరుతో మరొకరు తీసి విడుదల చేశారు.బ్రూస్‌లీ బతికి ఉన్నప్పుడు 'వారియర్‌' పేరుతో మరో కథను రాశారు. కానీ అది అప్పుడు కార్యరూపం దాల్చకుండానే బ్రూస్‌లీ మరణించాడు. అయితే చాలా కాలం తర్వాత బ్రూస్‌లీ కూతురు షాన్నన్‌ లీకి ఆ కథ దొరికింది. దీంతో తాజాగా ఆ కథను బుల్లితెరపై టీవీ సిరీస్‌గా మలిచేందుకు ప్రయత్నిస్తోంది.ఈ కథ మొత్తం మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌ అయిన ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంటుందట. దీన్ని బ్రూస్‌లీ జన్మించిన శాన్‌ఫ్రాన్సిస్‌స్కోలోని చైనాటౌన్‌లో చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com