ఇసుక తుపాన్లనుండి ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా

- April 14, 2015 , by Maagulf
ఇసుక తుపాన్లనుండి ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా

గల్ఫ్‌ దేశాల్లో ఇసుక తుపాన్లు వేసవి కాలంలో ఎక్కువగా ప్రజల్ని ఇబ్బంది పెడ్తుంటాయి. అనేక అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టే ఇసుక తుపాన్లనుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి హమాద్‌ మెడికల్‌ కార్పొరేషన్‌, ప్రజలకు కొన్ని సూచనలు, సలహాలు అందిస్తోంది. ఎలర్జీలు, శ్వాసకోశ సమస్యలూ ఇసుక తుపాన్ల వల్ల ఎక్కువగా వచ్చే ఆరోగ్య సమస్యలు. ముఖ్యంగా చిన్న పిల్లల్ని ఇంట్లోంచి బయటకు రాకుండా చూడాలనీ, తుపాన్లు వచ్చే అవకాశం ఉన్న సమయాల్లో పార్కులకు వెళ్ళకుండా వుండటమే మంచిదనీ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తగినంతగా ఇసుక తుపాన్లపై ప్రచారం జరుగుతుండడంతోపాటు, ప్రజల్లో పెరిగిన అవగాహనతో తుపాన్ల వల్ల అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా పెరగడంలేదని వైద్యులు వెల్లడిరచారు. వైద్యులు అందిస్తున్న సలహాలు ఏమిటంటే, భారీగా ఈదురుగాలులు వీస్తున్నప్పుడు, విజిబులిటీ లేనప్పుడు బయటకు వెళ్ళడాన్ని వీలైనంతవరకు తగ్గించుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళాల్సి వస్తే నోటికీ, ముక్కుకీ మాస్క్‌ వేసుకోవాలి. కళ్ళు పూర్తిగా కవర్‌ అయ్యేలా స్పెక్టకల్స్‌ని ధరించాలి. కళ్ళలో దుమ్ము పడినట్లు అనిపిస్తే, చల్లటి నీళ్ళతో కడగాలి. కాంటాక్ట్‌ లెన్స్‌ వున్నవారు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దగ్గు, జలుబు వంటి సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. కార్లలో ప్రయాణించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ విండో గ్లాసెస్‌ని క్లోజ్‌ చేసి వుంచాలి. చిన్న పిల్లలు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడ్తున్నవారికి శ్వాసకోశ సమస్యలు తీవ్రంగా పరిణమిస్తాయి గనుక, వారిని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com